డార్క్ చాక్లెట్స్ చాలా మంచిదని  నిపుణులు చెబుతున్నారు.

ఈ డార్క్ చాక్లెట్లలో చక్కెరస్థాయి తక్కువగా ఉంటుంది.

డార్క్ చాక్లెట్ తినటం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని పలు పరిశోధనలు కూడా వెల్లడించాయి.

మానసిక ఒత్తిడిని తగ్గించే అద్భుత గుణాలు చాక్లెట్‌లో ఉన్నాయని చెబుతున్నారు

మన మెదడులో సెరటోనిన్‌ హార్మోన్‌ స్థాయులను పెంచి ఆందోళనలను తగ్గిస్తుంది.మనసుకు ప్రశాంతాన్నిస్తుంది.

చాక్లెట్‌లోని ఫ్లేవనాయిడ్స్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.

చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

గర్భిణి స్త్రీలు రోజూ 30 గ్రాముల చాక్లెట్‌ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు.