అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో ఎక్కువ ప్రభావితమయ్యేది ఇదే.

ఎక్కువగా ఆలోచించడం వల్ల గుండె ప్రభావితం అవుతుంది.

అతిగా ఆలోచించడం వల్ల పల్స్‌పై ఇంపాక్ట్ చూపుతుంది.

ఊపిరి ఆడనట్లుగా, ఛాతిలో నొప్పిగా అనిపిస్తుంటుంది.

ఇలాంటి సమయంలో తమకు ఏదో అయిపోతుందని జనాలు హడలిపోతుంటారు

సాధారణ వ్యక్తిలో హృదయ స్పందన నిమిషానికి 60 నుంచి 100 బీట్స్ (BPM).

ఓవర్ థింకింగ్ వలన శరీరంలో కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది.

దీని కారణంగా హృదయ స్పందన రేటు పెరుగుతుంది.

ఓవర్ థింకింగ్ వలన వచ్చే ఛాతి నొప్పికి భయపడాల్సిన పనిలేదు.

కానీ, తరచుగా ఇలాగే వచ్చినట్లయితే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.