ఈ రోజుల్లో హై బీపీ చాలా సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. దీనిని నియంత్రించకుంటే.. అది గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీలు పాడవడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
వాకింగ్ వల్ల నిజంగా రక్తపోటు తగ్గుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
నడక అనేది చాలా సులభమైన వ్యాయామం. నడవడం వల్ల శరీరానికి చాలా మంచి కార్డియో వ్యాయామం. మరి ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది.
మన గుండె రక్తాన్ని శరీరంలోని అన్ని భాగాలకు పంపేటప్పుడు రక్తనాళాల్లో ఏర్పడే ఒత్తిడిని రక్తపోటు అంటారు.
రోజూ నడిస్తే గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీని వల్ల గుండె బలంగా మారుతుంది. బలమైన గుండె శరీరానికి అవసరమైన రక్తాన్ని సమర్థంగా పంపగలదు. ఫలితంగా రక్తనాళాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా నడక వల్ల రక్తనాళాలు సులభంగా నర్మంగా కదులుతూ ఉండడంతో రక్తప్రసరణ మరింత మెరుగవుతుంది.
శరీర బరువు ఎక్కువగా ఉన్నప్పుడు గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. రోజూ వాకింగ్ చేస్తే క్యాలరీలు ఖర్చవ్వడం ద్వారా బరువు అదుపులో ఉంటుంది. ఇది పరోక్షంగా హై బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది.
వాకింగ్ వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడిని తగ్గించడం ద్వారా బీపీని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి వాకింగ్ వల్ల ఇన్సులిన్ ప్రభావం మెరుగవుతుంది. దీంతో రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గి రక్తపోటు పెరగకుండా కాపాడుతుంది.
మొదటి రోజూ 10 నుండి 15 నిమిషాలు నడవడం మొదలుపెట్టాలి. తర్వాత నెమ్మదిగా ఆ సమయాన్ని 30 నిమిషాలకు పెంచుకోవాలి. నడిచేటప్పుడు శరీరం నిటారుగా ఉండేలా చూసుకోవాలి. తల వంచకుండా, నేరుగా చూస్తూ, చేతులను ఊపుతూ నడవడం ఆరోగ్యదాయకం.
వాకింగ్.. హై బీపీ ఉన్నవారికి చాలా సురక్షితమైన, సహజమైన మార్గం. రోజూ కొంత సేపు నడవడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని సైతం పొందవచ్చు.