అర్ధరాత్రి దాటినా నిద్ర పోవట్లేదా? అయితే మీ పనైపోయినట్లే...
మంచి ఆరోగ్యంతో జీవించాలంటే మంచి ఆహారపు అలవాట్లతో పాటు నిద్ర కూడా అవసరం.
ప్రతిరోజూ అర్థరాత్రి వరకు మేల్కొని ఉండే అలవాటు ఉంటే అది బరువును పెంచుతుంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి అనేక తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది.
ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యల మరింత ప్రమాదాన్ని పెంచుతుంది.
రాత్రి సమయంలో ఆలస్యంగా మేల్కొని ఉండటం, తక్కువ నిద్రపోవడం వాల్ల రోజంతా ఆలోచించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, మీ నిద్ర విధానాన్ని మెరుగుపరచుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు.
మీరు మీ రోజును వృధా చేయకూడదనుకుంటే సమయానికి నిద్రపోయి తగినంత నిద్ర పొందండి.