కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు 5 మార్గాలు

ఇటీవల కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతోంది. కాబట్టి, జాగ్రత్తగా ఉండటం అవసరం.

తగినంత నీరు తాగండి. సరైన హైడ్రేషన్ కిడ్నీ రాళ్లు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

రక్తంలో అధిక చక్కెర కిడ్నీలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. కాబట్టి, బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో జాగ్రత్త వహించాలి.

ఇబుఫ్రోఫెన్ వంటి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్(NSID) ఎక్కువ మోతాదులో వాడకండి.

క్రమం తప్పకుండా బీపీ టెస్ట్ చేసుకోండి. రక్తపోటు పెరగకుండా చూసకోండి.

శారీరక శ్రమ గుండె, కిడ్నీలు ఇలా మొత్తం శరీర అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.