ఒత్తిడిని తగ్గించుకోవడానికి  జీలకర్ర బాగా పనిచేస్తుంది.

జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.  ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఉండవు.

మన వంట గదిలో వుండే మసాలా దినుసులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గాలనుకుంటే జీలకర్ర బెస్ట్‌ రెమిడీగా పనిచేస్తుంది.జీలకర్రను తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు.

షుగర్ ఉన్నవారు జీలకర్రని తీసుకుంటే మంచిది. టైప్-2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది. ఇన్సులిన్ స్థాయిలు నియంత్రిస్తాయి

జీలకర్రలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తొలగించడంలో సహాయపడుతుంది.

మలబద్ధకం సమస్య నుంచి బయటపడడానికి జీలకర్ర బాగా పని చేస్తుంది. జీలకర్రను తీసుకోవడం వల్ల పేగు కండరాలు బలంగా మారతాయి.

జీలకర్ర నీరు మధుమేహ రోగులకు ఔషధం లాంటిదని అంటారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులే కాకుండా ఊబకాయం ఉన్నవారు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.