సపోటా తింటే.. ఇన్ని లాభాలా..

సపోటా రోజు తింటే రోగాలు దరిచేరవు. శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ పండు అంతా తినవచ్చు. 

వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణగా పని చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటాయి.

సపోటాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం బాగా జరిగేలా చేస్తుంది. మలబద్ధకం ఉండే వారికి ఇది చాలా మంచిది.

చర్మానికి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ఇవి సపోటాలో పుష్కలంగా ఉంటాయి. చర్మం కాంతివంతంగా కనిపించేందుకు సహాయపడుతుంది.

సపోటాలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది. హైబీపీతో ఇబ్బంది పడే వారు.. వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.

ఉదయాన్నే సపోటా తింటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పని చేసే శక్తి పెరుగుతుంది. రోజంతా చురుకుగా ఉంటారు.

సపోటాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అధిక బరువు ఉన్న వారికి ఇది అనుకూలంగా పనిచేస్తుంది.

వీటిలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటుంది. ఇవి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. దంతాలు గట్టిగా మారతాయి. శరీర నిర్మాణం బలంగా ఉండేందుకు ఇది సహాయపడుతుంది.

సపోటాలో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మంచిది.