ధనియాల పొడిని దాదాపు అన్ని  వంటకాల్లో విరివిగా వాడుతుంటారు.

వంటకు మంచి రుచిని అందించే ధనియాలు ఆరోగ్యానికి  అంతే మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ మర్నాడు ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా.

ధనియాల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది రెటినాల్ హెల్త్‌కి సపోర్ట్ చేస్తుంది. దీంతో కంటి సమస్యలు దూరమవుతాయి. కంటి చూపు మెరుగవుతుంది.

రాత్రంతా నానబెట్టిన ధనియాల నీటిని పరగడుపునే తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్​లో ఉంటాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్ ఉన్నవారు ఈ నీటిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ధనియాల నీటిలో చెడు కొలెస్ట్రాల్​ను కంట్రోల్ చేసే లక్షణాలు ఉంటాయి

ధనియవాటర్ ఇలా క్రమం తప్పకుండా తాగితే థైరాయిడ్ లక్షణాలు తగ్గుతాయి.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు బరువు తగ్గే ప్రయత్నంలో ఈ ధనియాల నీరు తాగటం మంచి ఫలితాన్నిస్తుంది.