సుగంధ ద్రవ్యాలు తాజాగా  లేవని చెప్పే 6 సంకేతాలు..!

పాత మసాలా దినుసులు వంటకం రుచిని చెడగొడతాయి. వాడుకోవడానికి పనికిరావని చెప్పే సంకేతాలు ఇవే.

సుగంధద్రవ్యాల రంగు వాడిపోయినట్టు ఉండకూడదు. ఉదాహరణకు పసుపు లేదా కారం పొడి రంగు మసకబారితే ప్రభావం తగ్గిందని అర్థం.

తాజా స్పైసెస్‌కు బలమైన వాసన ఉంటుంది. ఒకసారి నలిపి చూడండి. తక్కువ వాసనలు ఉంటే నూనెలు ఆవిరైపోయినట్లే.

తేమ వల్ల మసాలా దినుసులు పాడైపోతాయి. ఒకవేళ అతుక్కుని ఉన్నట్లయితే వాటిని పారవేయండి. 

కొంచెం మసాలా తీసుకుని రుచి చూడండి. రుచి తగలకపోతే గడువు ముగిసినట్లే. వంటలలో ఉపయోగించకూడదు.

మసాల దినుసుల పొడులు 1-2 సంవత్సరాలు నిల్వ ఉంటాయి. లవంగాలు, మిరియాలు వంటివి 4 ఏళ్ల వరకూ ఉంటాయి.

సుగంధ ద్రవ్యాలు పాంట్రీ తెగుళ్లను ఆకర్షిస్తాయి. కీటకలు, వెబ్బింగ్ లేదా వింత ఆకృతిని గమనిస్తే వెంటనే పారవేసి జాడీలను క్లీన్ చేయండి.