పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒక ప్రత్యకమైన ఆకారంను కలిగి ఉంటుంది.

నక్షత్ర ఆకారంలో కనిపించే ఈ పండు జ్యూసీ జ్యుసీగా ఉంటు బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటే పచ్చి పండ్లు పుల్లగా ఉంటాయి.

ఈ స్టార్ ప్రూట్ లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉంటాయి. 

వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు ఈ పండు తింటే మంచిది.

బరువు తగ్గాలనుకునేవారు వారికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

చెడు కొలెస్ట్రాల్‌ చర్యను నిరోధిస్తాయి. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది.

గుండె సమస్యతో బాధపడుతున్నవారికి కూడా ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది.

సోడియం, పొటాషియం, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న స్టార్‌ఫ్రూట్స్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి.