అంజీర్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మహిళలు వీటిని తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
అంజీర్ పండ్లే కాకుండా వీటి ఆకుల వల్ల కూడా లెక్కలేనన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఈ ఆకుల్లో విటమిన్లు, ఖనిజాలతోపాటు ఫోలిక్ యాసిడ్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్ వంటివి సమృద్ధిగా లభిస్తాయి. వీటిలో ఎ, సి, కె, బి విటమిన్లు సైతం ఉంటాయి.
అంజీర్ ఆకులను టీలో వేసి మరిగించి తీసుకుంటే.. అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అంజీర్ ఆకుల్లో అత్యధిక పోషకాలుంటాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆకుల్లోని ఔషధ గుణాలు మలబద్ధక సమస్య నుంచి దూరం చేస్తుంది.
అంజీర ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్లు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ నుండి రక్షిస్తాయి.
ఈ ఆకుల్లో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. మీ ఎముకలు దృఢంగా ఉండాలంటే అంజీర టీని మీ ఆహారంలో తప్పని సరిగా చేర్చుకోవాలి. ఇది ఎముకలతో పాటు దంతాలను సైతం బలపరుస్తుంది.