పుదీనా ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో నాలుగైదు పుదీనా ఆకులు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

పుదీనా ఆకులలో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పుదీనా జీర్ణ సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పుదీనా ఆకులతో చేసే వైద్యం ఉపశమనం కలిగిస్తుంది.

భోజనం తర్వాత ఒక కప్పు పుదీనా టీ తాగితే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. కడుపులో అసౌకర్యం తగ్గుతుంది.

వికారం, వాంతులు వంటి సమస్యలను కూడా పుదీనా తగ్గిస్తుంది. బస్సు, కార్లు వంటి ప్రయాణాల్లో వికారంగా అనిపించేవారు పుదీనా ఆకులను నమలడం లేదా పుదీనా టీ తాగడం మంచిది.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి శ్వాసకోశ సమస్యలకు పుదీనా ఒక సహజ ఔషధంలా పనిచేస్తుంది. పుదీనాలో ఉండే మెంథాల్ ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది, శ్వాసనాళాలను తెరిచి, శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.