ఉలవలే కదా అని తక్కువ అంచనా వేయకండి.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు

ఉలవల్లో పిండిపదార్థాలు, ప్రొటీన్‌, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

ఉలవలు ఆకలిని పెంచుతాయి

 మలబద్ధకం వదలడంతో పాటు, సుఖ విరోచనం అవుతుంది.. జీర్ణశక్తి కూడా మెరుగు పడుతుంది

ఉలవల్లోని మాంసకృత్తుల వల్ల కండరాలు బలపడతాయి

 సర్జరీలు చేయించుకున్నవాళ్లు త్వరగా కోలుకోవాలంటే తరచూ ఉలవలతో తయారైన పదార్థాలు తినాలి

క్యాల్షియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.. కాబట్టి ఉలవలు తింటే ఎముకలు దృఢమవుతాయి

ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం లేనేలేదు. 

ఉలవల్లో ఫైబ‌ర్ ఉండ‌డం వ‌ల్ల ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, ర‌క్తపోటు నియంత్రణలో ఉంటాయి

ఉలవలు ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది.. గనుక తగినంత మజ్జిగ కూడా తీసుకుంటే మంచిది