దాల్చిన చెక్క నీరు తాగితే ఆరోగ్యానికి ఇన్ని లాభాలుంటాయని తెలుసా?

దాల్చినచెక్క గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఇందులో పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సమృద్దిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వయస్సు సంబంధిత న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఉబ్బరం, గ్యాస్ సమస్యలను తగ్గించడం, అజీర్ణ లక్షణాలను తగ్గించడం ద్వారా మెరుగైన జీవక్రియకు దాల్చిన చెక్క నీరు సహాయపడుతుంది.

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఇన్ఫమేటరీ గుణాలు శరీరంలో వాపును, ఆర్థరైటిస్ వంటి తాపజనక పరిస్థితుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

జీవక్రియను మెరుగు పరచడం ద్వారా బరువు తగ్గడంలో దాల్చిన చెక్క నీరు  దోహదం చేస్తుంది.

దాల్చిన చెక్కలో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు ఎదుర్కోవడంలో, రోగనిరోధక పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.

దాల్చిన చెక్క నీరు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తప్రసరణను మెరుగుపరచడం, మంటను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

శరీరంలో మంటలు తగ్గించడం ద్వారా దాల్చిన చెక్క నీరు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.