బియ్యానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు..

కాలీఫ్లవర్..   బియ్యాన్ని పోలి ఉండే తురిమిన లేదా ప్రోసెస్ చేసిన కాలీఫ్లవర్. ఇది తక్కువ పిండి పదార్థాలు, విటమిన్లు కలిగి ఉంటుంది.

క్వినోవా..  ఫైబర్ అధికంగా ఉండే ప్రోటీన్ రిచ్ ధాన్యం, అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంది. దీనిని బియ్యానికి బదులుగా వాడుకోవచ్చు.

బ్రౌన్ రైస్..  వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో ఎక్కువ పోషకాలున్నాయి.

బార్లీ..  ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉండే ధాన్యం.

ఫారో..  ఫైబర్, ప్రోటీన్ అధికంగా కలిగిన ఫారో సలాడ్‌లలో సూప్‌లలో లేదా సైడ్ డిష్‌గా బావుంటుంది.

పప్పులు..  ధాన్యం కానప్పటికీ, కాయధాన్యాలలో ప్రోటీన్, అధిక ఫైబర్ ఉన్నాయి. ఇది సూప్స్, వంటకాల్లో వాడుకోవచ్చు.

అడవి బియ్యం..  వైట్ రైస్ తో పోలిస్తే ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే న్యూట్రీషియన్. 

బ్రోకలీ ..  సన్నగా తరిగిన బ్రోకలీ అన్నాన్ని తీసుకున్నా సరిపోతుంది. ఇందులోని తక్కువ కార్బ్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.