పచ్చి ఉల్లిపాయ కిడ్నీ రోగులకు ఆరోగ్యకరమేనా?

పచ్చి ఉల్లిపాయలలో సహజంగానే పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి(CKD) ఉన్నవారికి సురక్షితం.

ఉల్లిపాయలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వాపు, ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడతాయి.

CKD వచ్చేవారికి గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువ. ఉల్లిపాయ సల్ఫర్ సల్ఫేడ్లు, ఫ్లేవనాయిడ్లు గుండెకు ప్రయోజనకరం.

పచ్చి ఉల్లిపాయలో సోడియం ఉండదు. కాబట్టి, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మంచిది.

ఉల్లిపాయలో రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. డయాబెటిస్ పేషెంట్లకు మేలు చేస్తుంది.

పచ్చి ఉల్లిపాయలను మితంగానే తీసుకోవాలి. కిడ్నీ ఆరోగ్యానికి సరిపడే ఆహారంతోనే తీసుకోవాలి.