వగరుగా ఉండే పచ్చి అల్లం  తినడం కాస్త కష్టంగానే ఉంటుంది.

తినగలిగితే మాత్రం చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

రక్తపోటును, చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా అల్లం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి. లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

జీర్ణక్రియను సులభతరం చేసి గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది.

గొంతు నొప్పి, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీపై అల్లం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

మెటబాలిజాన్ని పెంచడం, కొవ్వును కరిగించే లక్షణాలు కలిగి ఉన్న అల్లం బరువు నిర్వహణకు బాగా ఉపయోగపడుతుంది.