చాలా మంది ఏసీ లేకుండా క్షణం కూడా ఉండలేరు.

కానీ, ఎక్కువ సేపు ఏసీలో గడిపితే అనర్థాలు కలుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఎక్కువ సేపు ఏసీలో ఉంటే చర్మం పొడిబారి దురదలు మొదలవుతాయి

ఏసి గదిలోని గాలిలో తేమ తక్కువగా ఉండటంతో దగ్గు, జలుబు వంటివి రావచ్చు

ఏసీలో ఎక్కువసేపు ఉంటే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది

తక్కువ ఉష్ణోగ్రతలు, డ్రై ఎయిర్ కారణంగా తలనొప్పి కూడా వేధించొచ్చు

జీవక్రియలు నెమ్మదించి నీరసంగా, బద్ధకంగా అనిపించే ప్రమాదం కూడా ఉంది

అపరిశుభ్రంగా ఉన్న ఏసీ ఫిల్టర్‌ల కారణంగా అలర్జీల బారిన పడే అవకాశం కూడా ఉంది

కండరాలు పట్టేసినట్టు ఉండటం, రోగనిరోధక శక్తి బలహీనపడే ముప్పు కూడా ఉంటుంది.