ఉప్పు వల్లే కాదు.. ఇవి తిన్నా బీపీ అమాంతం పెరిగిపోతుంది..
ఈ రోజుల్లో చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు.
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల బీపీ పెరుగుతుందని అందరికీ తెలుసు. కానీ తెలిసీ తెలియక ఈ ఆహార పదార్థాలు తిన్నా హైపర్‌టెన్షన్ పెరిగిపోయి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు. కాబట్టి, జాగ్రత్త.
నూడుల్స్, చిప్స్, నమ్కీన్, బిస్కెట్లు, పాస్తా లేదా స్నాక్స్ తినడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవన్నీ సోడియం, ట్రాన్స్ ఫ్యాట్స్, ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటాయి. ఇవి హై బీపీకి ప్రత్యక్షంగా కారణమవుతాయి.
అధిక రక్తపోటుతో బాధపడేవారు వేయించిన ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మేలు.
ఊరగాయలను ఇంట్లో తయారు చేసినా లేదా మార్కెట్లో కొన్నా వీటిలో నూనె, ఉప్పు లేదా పులుపు కచ్చితంగా ఎక్కువే ఉంటుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఎక్కువగా స్వీట్లు తినడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది.
నిజానికి మీరు చాక్లెట్, స్వీట్లు లేదా ఏదైనా ఇతర బేకరీ వస్తువులు వంటి తీపి పదార్థాలను ఎక్కువగా తిన్నప్పుడు ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరుగుతుంది. దీని వల్ల సిరలు బిగుసుకుపోయి బీపీ పెరగడం ప్రారంభమవుతుంది.