వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటే ప్రమాదం !

వర్షాకాలంలో ఈ కూరగాయలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిదే కానీ వర్షాకాలంలో ఈ ఆకుకూరలను తినడం వలన వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉందంట.

వర్షాకాలంలో మొక్కల ఆకులపై హానికరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ఉంటాయి. అందువల్ల వీలైనంత వరకు ఈ ఆకుకూరలను దూరం పెట్టడమే మంచిది.

ఆయుర్వేదం ప్రకారం వర్షాకాలంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ తినకపోవడమే మంచిది. ఇవి శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

కడుపు నొప్పి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో ఈ ఆహారాలు తినకపోవడమే ఆరోగ్యానికి మంచిది.

వంకాయలను వర్షాకాలంలో తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 వంకాయలో ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఇవి వర్షాకాలంలో బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించే రసాయనాన్ని విడుదల చేస్తాయి.

వర్షాకాలంలో టమాటా ఎక్కువగా తింటే.. అజీర్ణం, గ్యాస్‌ సమస్యలు ఎదురవుతాయి.