కంటి ఆరోగ్యం కోసం ఖచ్చితంగా ఈ ఫుడ్స్ తినాల్సిందే..
పోషక లోపాల కారణంగా కూడా కంటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని రకాల ఆహారాల పదార్థాలతో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు
బెల్ పెప్పర్స్, ఆకుపచ్చ కూరగాయలు తినడం వల్ల కంటిని ఆరోగ్యంగా ఉంచవచ్చు.
వీటిని తరచూ తీసుకోవడం వల్ల కళ్ళను యూవీ నష్టం నుంచి రక్షించడంతో పాటు కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
క్యారెట్లను తరచూ తినడం వల్ల దృష్టి మెరుగుపడటంతో పాటు రెటీనాను బలోపేతం చేయడంలో సహాయపడతాయి
కంటి సమస్యలు ఉన్నవారు కచ్చితంగా క్యారెట్లను తిని ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు
రెడ్ బెల్ పెప్పర్స్‌లో విటమిన్ సీ యాంటీఆక్సిడెంట్లు పుష్కలం. ఇవి కళ్ళను వాపు, ఒత్తిడి నుంచి రక్షిస్తాయి.
రెడ్ బెల్ పెప్పర్స్‌లోని విటమిన్ సీ కంటెంట్ కళ్ళలోని రక్త నాళాల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
ఆకుపచ్చ కూరగాయలు కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిని ప్రతీరోజూ తీసుకోవడం ద్వారా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.