మురికి నీరు ఒకచోట నుండి మరొక ప్రదేశానికి పారుతూనే కొద్ది ఈ సీజన్ లో దోమలు వృద్ధి చెందుతాయి.
గార్డెన్లో ఈ మొక్కలు పెంచడం వలన ఇంట్లోకి దోమలు రాకుండా చాలా వరకు సహాయపడతాయి.
వేప: వేపను పురుగుమందుగా పరిగణిస్తారు. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ దోమలు, క్రిమికీటకాదులు తరిమి కొట్టడానికి వేప ఆకులను కాల్చి పొగబెట్టేవారు
నిమ్మగడ్డి నూనె: ఈ మొక్క ఇది దోమలను తరిమికొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నమ్మకం. ఈ నిమ్మగడ్డి నూనెను దోమల నివారణ క్రీములు, రిపెల్లెంట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
రోజ్మేరీ: ఈ వాసనకు దోమలు పారిపోతాయి. ఈ పువ్వులు ఇంట్లో పురుగుమందుగా కూడా ఉపయోగించవచ్చు
తులసి: ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. తలనొప్పి, గొంతు నొప్పి జలుబుతో బాధపడే వారు తులసి ఆకులు నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుంది.
క్యాట్నిప్: పుదీనా ఆకులను పోలి ఉండే ఈ మొక్క ఎండలోనూ, నీడలోనూ బాగా పెరుగుతుంది. ఇది పురుగుమందు కంటే ఎక్కువ ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది.