టీని పాలతో కలిపి తాగడం వల్ల  శరీరానికి లభించే ఎనర్జీ.. 

చాలా సేపు మరగబెట్టినప్పుడు నశిస్తుందట.

ఛాయ్​లో టానిన్లు అనే సహజ రసాయనాల సాంద్రత పెరిగి శరీరంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పెరిగిన టానిన్ల సాంద్రత జీర్ణ సమస్యలకు దారితీస్తుందట.

అధిక టానిన్లు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రావొచ్చు.

టీ మరిగించడం వల్ల ఏర్పడే టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయి.

కొన్ని అధ్యయనాలు టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదమూ పెరుగుతుందట.

టీలోని కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు రావొచ్చట.

పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి వంటివి నశిస్తాయంటున్నారు.