PCOD సమస్య నుంచి బయటపడాలనుందా..!

నేటి కాలంలో ఫ్యాటీ లివర్, అధిక బరువు కారణంగా మహిళల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 

హార్మోన్ల అసమతుల్యత క్రమరహిత రుతుక్రమం, అధిక బరువు, వంధ్యత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది.

ఆహారంలో ఫైబర్, ప్రొటీన్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేలా చూసుకోవాలి. ప్యాక్ చేసిన, ప్రాసెసింగ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడక, యోగా లేదా కార్డియో చేయండి. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

మానసిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతను పెంచుతుంది. ధ్యానం, శ్వాసక్రియ సంబంధిత వ్యాయామాలు చేయండి.

ప్రతి రాత్రి కనీసం 7-8 గంటలు నిద్రపోండి. తగినంత నిద్ర లేకపోతే ఋతుస్రావం సక్రమంగా జరగదు.

మెంతి గింజల నీరు, అశ్వగంధ లేదా దాల్చిన చెక్క వంటి గృహ నివారణలు PCOD నుంచి ఉపశమనం కలిగించగలవు.

సమస్య తీవ్రంగా ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించండి తగిన చికిత్స పొందండి.