దుంపలు వాతం చేస్తాయంటారు. కానీ వాటిలో అనేక పోషకాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వీటిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.
వీటిని తీసుకోవడం వల్ల షుగర్ పేషంట్లకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే.. ఇవి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది.
వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ ఇ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
చామదుంపను తరచూ తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ల నుంచి బయటపడవచ్చు.
అధిక బరువును తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
శాఖాహారం తీసుకునే వారికి ఈ దుంప వరమనే చెప్పాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
కంటి కణాల క్షీణతను తగ్గిస్తుంది.అంతేకాకుండా కంటిచూపును మెరుగు పరుస్తుంది.
చామదుంపలలో ఫైబర్ ఉంటుంది. ఎనిమియా సమస్యతో బాధ పడే వాళ్ళకి చామదుంపలు బాగా ఉపయోగపడుతాయి.
చామ దుంపలో పోటాషియం అధికంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి లాభం చేకూరుతుంది.
చామదంపు మూలాల్లో డయోస్జెనిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కొత్త చర్మ కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేయడం ద్వారా చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.