వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లలో ఒకటి కర్బూజా
వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లను, కూరగాయలను ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాల్సిందే.కాల్చిన ల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గుండెకు మేలు చేస్తుంది.
కాలానుగుణంగా లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరగడమే కాకుండా కాలక్రమేణా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఎండ వేడిమి నుంచి శరీరానికి తక్షణ శక్తినందించే పండ్లు ఎన్నో ఉన్నప్పటికీ కర్బూజా ప్రత్యేకత వేరు.
ఈ పండులోని వివిధ పోషకాలు శరీరంలో నీటి స్థాయులను పెంచి డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి
చాలా మంది కర్భూజా లోపల ఉండే విత్తనాలను పడేస్తుంటారు. నిజానికి ఇవి ముఖ్యమైన ఖనిజాలతో నిండి ఉంటాయి.
దీని గింజలను కడిగి ఎండబెట్టి, వివిధ వంటలలో ఉపయోగించడమే కాకుండా, వాటిపై పొట్టు తొలగించి నేరుగాతినొచ్చు
కర్భూజా గింజలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండి కంటి చూపును మేరుగుపరచడంలో సహాయపడతాయి మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహించే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అనేక విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి