నిమ్మకాయలో సి-విటమిన్‌  విస్తారంగా ఉంటుంది

కనుక ఆరోగ్యానికెంతో మంచిది. అసలా వాసన చూస్తేనే ఆహ్లాదంగా ఉంటుంది.

నిమ్మచెక్కలను వ్యర్థం చేయకుండా ఎలా వినియోగించాలో తెలుసుకుందాం

నిమ్మకాయలో పొటాషియం, ఐరన్, విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి

బరువు తగ్గించడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు, నిమ్మకాయ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది

కానీ నిమ్మకాయ మాత్రమే కాదు దాని తొక్క కూడా శరీరానికి మేలు చేస్తుంది.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం నిమ్మ తొక్కల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి

రోగనిరోధక శక్తిని పెంచడంలో నిమ్మ తొక్క సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కూడా చర్మానికి మేలు చేస్తాయి