మనలో చాలా మంది కూరలోనో, చారులోనో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేస్తాం.

అయితే మనకు విరివిగా దొరికే ఈ ఆకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు

దీన్ని నేరుగా, పొడి, కషాయం, పచ్చడి, స్మూథీ... ఇలా పలు రకాలుగా తీసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామంతోపాటు రోజూ గుప్పెడు తాజా కరివేపాకు తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

ఈ ఆకుల్లోని కార్బొజోల్‌ ఆల్కలాయిడ్స్‌ అందుకు కారణం

కరివేపాకు గుండె జబ్బుల నుంచి కంటి ఆరోగ్యం వరకు ఎన్నో రకాలుగా ప్రభావవంతంగా ఉంటుంది.

ముఖ్యంగా కరివేపాకు తింటే గుండె జబ్బులను దరికి చేర్చదు. 

దీన్ని తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండె రోగులకు ప్రభావవంతంగా ఉంటుంది