దీని పువ్వుల ముద్దను ముఖానికి  రాసుకుంటే ముఖం మెరుస్తుంది.

పారిజాత ఆకులను మెత్తగా నూరి చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు నయమవుతాయి.

ఆర్థరైటిస్, సయాటికా, ఎముకల పగుళ్లు, పైల్స్, జ్వరం, డెంగ్యూ, మలేరియా, పొడి దగ్గు, మధుమేహం వంటి వ్యాధుల చికిత్సకు కూడా పారిజాతం ఉపయోగించబడుతుంది.

పారిజాత ఆకులు స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది.

పారిజాతం చెట్టు గింజ‌ల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి అందులో కొద్దిగా నీటిని క‌లిపి పేస్ట్ లా చేసుకుని త‌లకు ప‌ట్టించ‌డం వ‌ల్ల త‌ల‌లో వ‌చ్చే కురుపులు, పుండ్లు త‌గ్గుతాయి.

ఈ గింజ‌ల చూర్ణానికి కొబ్బ‌రి నూనెను క‌లిపి త‌ల‌కు రాసుకుని ఒక గంట త‌రువాత త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది.

పారిజాతం చెట్టు గింజ‌ల‌ను మ‌ట్టిపాత్ర‌లో వేసి న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేసి ఈ గింజ‌ల‌ను పొడిగా చేసి హార‌తి క‌ర్పూరం పొడిని, కొబ్బ‌రి నూనెను క‌లిపి పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ ను లేప‌నంగా రాయ‌డం వ‌ల్ల గజ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి. దీంతో చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.