ఈ లక్షణాలు కనిపిస్తే ..లంగ్స్ డేంజర్‌లో పడినట్లు..

 శరీరంలోని ప్రధాన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఇవి చెడిపోతే మనిషి బతకడం చాలా కష్టం.

  ఇవి రక్తంలోని కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడంలో, ఆక్సిజన్ ప్రసరణలో సహాయపడతాయి.

కానీ కొన్ని చెడు అలవాట్ల వల్ల ఊపిరితిత్తులు పాడవుతున్నాయి.

ధూమపానం, కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఎక్కువగా శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారు.

 నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు గురకవచ్చినా, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారినా ఇది ఊపిరితిత్తుల అనారోగ్యానికి కారణమని గుర్తించండి.

 ఒక్కోసారి నిద్రలో సడెన్‌గా శ్వాస ఆగిపోతుంది. కొందరిలో ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది.

 ఊపిరి పీల్చుకునేటప్పుడు నొప్పి, కష్టంగా అనిపించినా ఊపిరితిత్తులు ప్రమాదంలో ఉన్నాయని అర్థం

 రక్తంతో దగ్గడం, కఫం, నాసికా స్రావాలు ఉత్పత్తికావడం ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతాలు.

 ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారిలో కఫం ఎక్కువగా ఉంటుంది.

దగ్గు, కఫం వరుసగా మూడు నెలలకు మించి తగ్గకపోతే అది ఊపిరితిత్తుల వ్యాధిగా గుర్తించాలి.

ఊపిరితిత్తుల సమస్య ఏర్పడినప్పుడు కూడా ఒక రకమైన ఛాతీ నొప్పి వస్తుంది.

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుందని గుర్తుంచుకోండి.

 తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇవి ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో  కొంత సమయం వ్యాయామం కూడా చేయాలి.