అనారోగ్యంగా ఉన్నప్పుడు మునగ తింటే ఈ లాభాలు..!
ప్రొటీన్లు, విటమిన్లూ పుష్కలంగా ఉండే మునక్కాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
మునక్కాయల్లో విటమిన్ ఎ, సి, ఇ లు అధికం. ఇవి శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.
మునగలో ఇనుము, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శక్తిని పెంచి వ్యాధి నుంచి వేగంగా కోలుకునేలా చేస్తాయి.
మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి. అనారోగ్యంగా ఉన్న సమయంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి.
జలుబు, దగ్గు సమయంలో శరీరానికి అవసరమయ్యే రోగనిరోధక సమ్మేళనాలు మునగలో ఉంటాయి.
ఐరన్, విటమిన్ బి అధికంగా ఉండే మునక్కాయలు అలసట, బలహీనతను నియంత్రించేందుకు సహాయపడతాయి.
మునగలోని కాల్షియం, భాస్వరం ఎముకల బలాన్ని పెంపొందిస్తుంది.
మునక్కాయలు తింటే కడుపు ప్రశాంతంగా మారుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
Related Web Stories
శొంఠి తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..
వానాకాలంలో పెరుగు, తినడం మంచిదేనా..?
తిన్న తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా.. జాగ్రత్త
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా