చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా

కర్పూరంలో రకాలు ఉన్నాయి. వాటిలో పచ్చ కర్పూరం ఒకటి.

ఆగ్నేయాసియాలో కర్పూరం చెట్ల నుంచి దీనిని తయారు చేస్తారు. పచ్చ కర్పూరం వాసన.. చాలా బలంగా, ఆహ్లాదంగా ఉంటుంది.

కర్పూరాన్ని స్వచ్ఛతకు ప్రతిరూపంగా భావిస్తారు. ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందని నమ్ముతారు. 

పండగ, పర్వదినం వేళల్లో.. దేవుని ఉత్సవాలు, నైవేద్యం తయారీలో పచ్చ కర్పూరాన్ని వాడతారు. 

దీనిని ఔషధాల తయారీలో.. సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. వంటల్లో సైతం అధికంగా వాడతారు.

దీని వల్ల ఆహారానికి ప్రత్యేక రుచి సంతరించుకుంటుంది.  తీపి పదార్థాల తయారీలో వినియోగం వల్ల వీటి రుచిని మరింత పెంచుతుంది.

పచ్చ కర్పూరం ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది.

దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో ఎన్నో సమస్యలు తగ్గుతాయి. తమలపాకుతో కలిపి పచ్చ కర్పూరం తీసుకోవడం వల్ల వేడి తగ్గుతుంది. 

రోజుకి కొద్ది మోతాదు కర్పూరం తీసుకుంటే లైంగిక సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది.

జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు పచ్చ కర్పూరం వాడితే ఆ సమస్యలు తగ్గుతాయి. ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

నిమ్మరసాన్ని పచ్చ కర్పూరంతో కలిపి రాయడం వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గుతుంది.

నూనెలో కలిపి రాయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది.

వంటల్లో పచ్చ కర్పూరాన్ని చాలా కొద్ది మొత్తంలో ఉపయోగించాలి. అధిక మోతాదులో ఉపయోగిస్తే.. ఆరోగ్యానికి హాని చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.