వీటికి దూరంగా ఉంటేనే..  గ్యాస్ట్రిక్, ఎసిడిటీ తగ్గుతాయి 

రాత్రి సమయంలో మాంసం, వేపుళ్లు, జంక్ ఫుడ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. 

బాగాగా స్పైసీగా ఉండే ఫుడ్స్ జీర్ణ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. 

కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీల వల్ల కడుపులో మంట మొదలవుతుంది. 

జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి కొన్ని కూరగాయలు, ధాన్యాలు వంటి ఫైబర్ పదార్థాలు పడవు. 

పాలలో ఉండే లాక్టోస్ కొందరికి అసలు జీర్ణం కాదు. అలాంటి వారు పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. 

కూల్ డ్రింక్స్‌లో ఉండే కార్బొనేటెడ్ గ్యాస్  జీర్ణ సంబంధ సమస్యలను మరింత పెంచుతుంది. 

పంచదారకు బదులుగా ఉపయోగించే సార్బిటాల్, అస్పర్టమే వంటి కృత్రిమ స్వీటెనర్లు జీర్ణ వ్యవస్థకు మరింత ప్రమాదకరం. 

జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు కొద్ది రోజులు నిమ్మ, నారింజ వంటి సిట్రస్ ఫలాలకు దూరంగా ఉండాలి. 

ఆల్కహాల్ గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది.