వానాకాలంలో పెరుగు, తినడం మంచిదేనా..?
వానాకాలంలో వాతావరణంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అవసరం అని నిపుణులు అంటున్నారు.
ఆయుర్వేదం వర్షాకాలంలో పెరుగు తినొద్దని చెబుతోంది.
ఈ సీజన్‌లో శరీరంలో వాతం పెరుగుతుంది. దీని వల్ల పిత్తం పేరుకుపోతుంది. వీటి వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
పెరుగు జీర్ణక్రియకు మంచిదే అయినప్పటికీ వర్షాకాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో రంధ్రాలు మూసుకుపోతాయి.
శరీరంలో రంధ్రాలు మూసుకుపోవడం వల్ల అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి.
ఒకవేళ వానాకాలంలో పెరుగు తినాల్సి వస్తే ఎక్కువ మొత్తంలో ఎప్పుడూ తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి సమయంలో పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
పెరుగు తిన్న తర్వాత ఏదైనా అసౌకర్యం లేదా అలెర్జీ కనిపిస్తే వెంటనే వాడటం మానేయాలి. అలాగే వైద్యుడ్ని సంప్రదించాలి.
Related Web Stories
తిన్న తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా.. జాగ్రత్త
చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.. ఇదిగో సింపుల్ చిట్కా
మొక్కజొన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు..
శరీరంపై ఒత్తిడి తీసుకొచ్చే 5 రకాల ఆహారాలు ఇవే..