మామిడి పండ్లు అంటే చాలా  మందికి ఇష్టం ఉంటుంది.

అందుకే ధర గురించి ఆలోచించకుండా ఎక్కువ మామిడిపండ్లు కొనుగోలు చేసి తింటుంటారు.

అయితే ఇప్పుడున్న మార్కెట్లలో మంచి మామిడిపండ్లు అనేవి దొరకడం లేదు.

చాలా వరకు రసాయనాలు చల్లినవే మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు.

కాల్షియం, కార్బైడ్ వంటి హానికర రసాయనాలు వాడిన మామిడిపండ్లు తింటే ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

కొనుగోలు చేసే సమయంలో నిగ నిగ ఉన్నాయి కదా అని కొనుగోలు చేయకండి

తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు జారీ చేస్తున్నారు.

వరిగడ్డి తదితర సహజ పద్ధతిలో పండించిన మామిడిపండ్లతో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు