జుట్టు తెల్లబడుతోందా..  అయితే కారణం ఇదే..

తల తెల్లబడితే, వయసు పైబడుతోందని అనుకునేవాళ్లం. కానీ ఇది ఒకప్పటి పరిస్థితి. ఇప్పుడు బాల నెరుపు చిన్న వయసు లోనే మొదలవుతోంది. 

అలాగని ఇప్పుడిదంతా మామూలే అని సరిపెట్టుకోవలసిన అవసరం లేదు. 

ప్రొటీన్‌ లోపం ఉన్నా, ఐరన్‌ తగ్గి  రక్తహీనత లోనైనా, కాపర్‌ లోపం ఉన్నా వెంట్రుకలు తెల్లగా మారతాయి.

ఈ లోపాల తీవ్రత ఏ వయసులో పెరిగితే ఆ వయసులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలవుతాయి.

ఇంటి భోజనానికి బదులుగా బయటి చిరుతిళ్లు తినే పిల్లల్లో పోషకాహార లోపం చివరకు తెల్ల వెంట్రుకల రూపంలో బయల్పడుతుంది.

అదే పనిగా చదవమని ఒత్తిడి చేసినా, మెలనిన్‌ పరిమాణం తగ్గి వెంట్రుకలు తెల్లబడతాయి.