బిర్యానీ ఆకులో ఇన్ని పోషకాలున్నాయా.. 

బిర్యానీ ఆకు మంచి మసాలా మాత్రమే కాదు.. వాటిలో మంచి ఔషధ గుణాలు సైతం ఉన్నాయని పోషకాహార  నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఈ ఆకుతో వంటకు రుచి పెరగడమే కాకుండా.. ఇవి ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు.

బిర్యానీ ఆకులు జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తోంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసే ఎంజైమ్‌లను పెంచుతుంది. దీంతో అజీర్తి, మలబద్దకం దరి చేరవు. మూత్ర సంబంధ సమస్యలు, కిడ్నీలో రాళ్లను దూరం చేస్తాయి.

బిర్యానీ ఆకుల్లో ఫైటో కెమికల్స్‌ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి షుగర్‌ను నియంత్రిస్తాయి. వీటిని తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

వీటిలో యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎముకల్లో నొప్పి, వాపును తగ్గిస్తాయి. 

బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యల్ని బిర్యానీ ఆకులు తొలగిస్తాయి.

బిర్యాని ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపు, చర్మం ఎరుపెక్కడం వంటి సమస్యలను తొలగిస్తాయి.

బిర్యాని ఆకులు తీసుకుంటే ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి. 

బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు గుండె సమస్యలను దూరం చేస్తాయి. బిర్యాని ఆకులను వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి బిర్యానీ ఆకులు బాగా ఉపయోగపడతాయి.

బిర్యానీ ఆకులను తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయిటకుపోవచ్చు. బిర్యాని ఆకులు తింటే ముక్కు దిబ్బడ తగ్గుతుంది.

బిర్యానీ ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని పోగొట్టి జుట్టు ఎదుగుదలకి తోడ్పడతాయి.

వీటిలో విటమిన్ ఏ,సితోపాటు ఐరన్, మెగ్నీషియం వంటివి ఇమ్యూనిటీని పెంచుతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. నిద్రలేమి సమస్యలు దూరం చేస్తుంది.