వేసవిలో రోజుకోసారి ఈ జ్యూస్‌ తప్పక తీసుకోండి..

బత్తాయిలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

నీరసానికి గురైనప్పుడు గ్లాసుడు బత్తాయి జ్యూస్ తాగితే తక్షణ శక్తి వస్తుంది

 బత్తాయి రసంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో దీన్ని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి

బత్తాయి జ్యూస్‌ తాగడం వల్ల శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది.

బత్తాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

బత్తాయి జ్యూస్‌లో ఉండే విటమిన్ సి చర్మ కాంతిని కాపాడటానికి సహాయపడుతుంది

బత్తాయి జ్యూస్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది.