డార్క్ చాక్లెట్ తినడం  ఆరోగ్యానికి చాలా మంచిది.

ఈ విషయాన్ని వైద్యనిపుణులు తరచూ చెబుతుంటారు.

ఏ డార్క్ చాక్లెట్  ఎంత పరిమాణంలో ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఎలా తెలుస్తుంది

చాక్లెట్‌లో ఉపయోగించే కోకో మొక్క నుండి వస్తుంది. ఇందులో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి.

మార్కెట్లో లభించే చాక్లెట్‌లో చక్కెర, పాలు, కోకో వెన్న, చాలా తక్కువ మొత్తంలో కోకో ఉంటాయి.

డార్క్ చాక్లెట్‌లో కోకో ఎక్కువగా ఉంటుంది. చక్కెర తక్కువగా ఉంటుంది.

మెడికల్ న్యూస్ టుడే అధ్యయనం ప్రకారం, రోజుకు 20 నుండి 30 గ్రాముల డార్క్ చాక్లెట్ తినవచ్చు.

కోకో ఎంత ఎక్కువగా ఉంటే, అందులో ఫ్లేవనాయిడ్లు అంత ఎక్కువగా ఉంటాయి. కనీసం 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ కోకో ఉన్న చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది.