మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఈ దేశాలకు వెళ్తున్నారా.. జాగ్రత్త
కరోనా ఇంకా మాయం కాలేదు. ఆగ్నేయాసియాలోని హాంకాంగ్, సింగపూర్, చైనా, థాయిలాండ్ దేశాల్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
సింగపూర్‌లో 28 శాతం కేసులు నమోదు కాగా.. హాంకాంగ్‌లో ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగాయి. చైనాలో సైతం ఈ కేసులు భారీగా పెరిగాయి. ఇక థాయిలాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ అనంతరం కేసులు పెరుగుతోన్నాయి.
పరిస్థితి ముదిరే అవకాశముందని సమాచారం. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ దేశాలను సందర్శించకపోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
హాంకాంగ్‌లో కొత్త కొవిడ్ ఉదృతి ఉందని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి శాతం 11.4కి పెరిగింది.
హాంకాంగ్‌లో మరో 81 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 30 మంది మరణించారు. మృతుల్లో అత్యధికులు వృద్ధులు. వీరు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
సింగపూర్‌లో మే మాసం ప్రారంభంలో కోవిడ్ కేసులు 28 శాతం మేర పెరిగాయి. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య దాదాపు 30 శాతం పెరిగింది.
చైనాలో కోవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇటీవల ఈ కేసుల్లో పాజిటివ్ రేట్లు రెట్టింపు కన్న అధికంగా ఉన్నాయని ని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.
థాయిలాండ్‌లో సాంగ్‌క్రాన్ పండుగ తర్వాత ఈ కేసుల సంఖ్య పెరిగాయి. ఆరోగ్య అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టారు.