సాధారణ నాలుక గులాబీ లేదా లేత ఎరుపు రంగులో ఉంటుంది. దాని రంగు మారితే, అది ఏదైనా అంతర్గత సమస్యకు సంకేతం కావచ్చు.
తెల్లటి నాలుక: ఇది డీహైడ్రేషన్, నోటి త్రష్ (ఫంగల్ ఇన్ఫెక్షన్) లేదా ల్యూకోప్లాకియా (ధూమపానం వల్ల కలిగే సమస్య) లక్షణం కావచ్చు.
పసుపు నాలుక: కాలేయం లేదా కడుపు సమస్యలు, అధిక ధూమపానం లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు.
నల్ల నాలుక: ఇది బ్యాక్టీరియా లేదా ఫంగస్ పెరుగుదల వల్ల వస్తుంది. ఇది తరచుగా నోటి పరిశుభ్రత లేకపోవడమో లేదా యాంటీబయాటిక్స్ యొక్క దుష్ప్రభావంగానో వచ్చే అవకాశం ఉంది.
రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు నాలుకపై నిరంతర పుండ్లు కనిపించవచ్చు. ఇది హెచ్‌ఎవీలో ఎక్కువగా కనిపిస్తుంది.
నాలుక తిమ్మిరిగా లేదా జలదరింపుగా అనిపిస్తే.. అది నాడీ సంబంధిత సమస్యలు, విటమిన్ బి12 లోపం లేదా మధుమేహానికి సంకేతం కావచ్చు.
విటమిన్ బి12 లోపం ఉంటే నాలుక వాపు, ఎర్రగా, మృదువుగా మారుతుంది.
వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.