మధుమేహం ఉన్నవారికి అలర్ట్.. వర్షాకాలంలో వచ్చే ఈ  సమస్యతో పెద్ద ముప్పే..!

వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు సమస్యల గురించి జాగ్రత్తలు తీసుకునేవారు ఎక్కువ.

అయితే.. వర్షాకాలంలో చాలా ఎక్కువగా వచ్చే ఇన్ఫెక్షన్ ఒకటి ఉంది. అదే ఫుట్ ఫంగల్ ఇన్ఫెక్షన్.

పాదాలు, కాలి వేళ్ల మధ్య ఇన్పెక్షన్ వచ్చి ఇది పుండుగా మారి చాలా ఇబ్బంది పెడుతుంది.

 కానీ మధుమేహం ఉన్నవారికి మాత్రం ఇది చాలా పెద్ద ముప్పు తెచ్చిపెడుతుందని అంటున్నారు వైద్యులు.

కాళ్లు ఎక్కువసేపు నీటిలో ఉంచాల్సి వచ్చినా, వర్షం నీటిలో నడిచినా.. ఇంటికి వెళ్లిన తరువాత కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి.

వర్షాకాలంలో గోళ్లలో పంగస్ పేరుకుపోతుంది. ఇది ఇన్పెక్షన్ కు కారణం అవుతుంది. అందుకే గోళ్లను కత్తిరించుకోవాలి.

షూస్, సాక్స్ లు ధరించేవారు వాటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షం నీటిలో అవి తడిస్తే ఉతికి బాగా ఆరబెట్టుకోవాలి.

ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటం కోసం యాంటీ బ్యాక్టీరియల్ సోప్ లను కాళ్లు, చేతులు కడుక్కోవడానికి వాడాలి.