ఈ పండు రోజూ తింటే..  గుండె సమస్యలు రావంట..!

పియర్స్ పండ్లలో ఫైబర్, విటమిన్లు, విటమిన్-కె, విటమిన్-సి, ఖనిజాలైన పొటాషియం, కాపర్ వంటివి అధికంగా ఉంటాయి.

పియర్స్ పండ్లను తింటే రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది.

పియర్స్ పండ్లలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.

పియర్స్ పండ్లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉండటం వల్ల దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, తగ్గించడంలో సహాయపడుతుంది.

పియర్స్ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది.

పియర్స్ పండ్లలో ఉండే ఫైబర్ పేగులోని బైల్ యాసిడ్స్ ను బంధించి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. 

ఇది ఎముకల ఖనిజీకరణకు, బోలు ఎముకల వ్యాధి రాకుండా చేయడంలోనూ సహాయపడతుంది.