రెడ్ VS గ్రీన్ యాపిల్  ఏది ఆరోగ్యకరమైనది..

గ్రీన్ యాపిల్ లో విటమిన్-ఎ, బి, సి, ఇ వంటి అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.

గ్రీన్ యాపిల్ లో రెడ్ యాపిల్ కంటే తక్కువ షుగర్ లెవల్స్ ఉంటాయి. ఈ కారణంగా ఇది మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది.

కొన్ని అధ్యయనాల ప్రకారం బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి గ్రీన్ యాపిల్స్ మంచివి.

రెడ్ యాపిల్ లో యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిడిన్స్ ఇంటాయి. కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రుచికి తియ్యగా ఉంటాయి.

రెడ్ యాపిల్స్ లో కూడా ఐరన్, పొటాషియం కంటెంట్ ఉంటుంది. కానీ గ్రీన్ యాపిల్స్ కంటే తక్కువ.

రెడ్ యాపిల్ లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

సాధారణ ఆరోగ్యం కోసం.. చర్మ సంరక్షణలో భాగంగానూ రెడ్ యాపిల్ తీసుకుంటే మంచిది.