వేసవిలో శరీరంలోని మంటను తగ్గించేందుకు కొన్ని ఆహారాలు తీసుకోవాలి. అవేంటంటే..

పసుపులోని కుర్కిమిన్ శరీరంలోని మంటను తగ్గిస్తుంది. బాదం పాలతో కలుపుకొని తింటే మరింత ప్రయోజనం ఉంటుంది.

కొబ్బరి నీళ్లలోని పొటాషియం, ఎలక్ట్రోలైట్లు శరీరంలోని వేడిని, వాపును తగ్గిస్తాయి. 

కలబంద రసం పేగులకు ఉపశమనం కలిగిస్తుంది. 

గ్రీన్ టీ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటూ వాపు, మంటను తగ్గిస్తుంది. 

ఆమ్లా జ్యూస్‌లోని విటమిన్-సి, యాంటీ ఆన్ష్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంతో పాట రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

అల్లం, నిమ్మకాయ నీరు మంటను తగ్గిండంలో బాగా పని చేస్తాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.