ఉదయం నిమ్మరసం తాగితే…ఏం జరుగుతుందో తెలుసా?

 ప‌ర‌గ‌డుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బ‌దులుగా నిమ్మ‌ర‌సం తాగితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

 ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగండి.

అధిక బ‌రువుతో బాధపడేవారికి నిమ్మ దివ్యౌషధం. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది.

నిమ్మరసం జీర్ణవ్యవస్థను కండీషన్‌లో ఉంచుతుంది. ఉబ్బరం, ఛాతీలో మంట వంటి అజీర్తి లక్షణాలను తగ్గిస్తుంది.

నిమ్మరసంలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి .

నిమ్మరసం తాగితే శ్వాస తాజాగా ఉంటుంది. ఇందులో ఉండే ఆమ్లత్వం నోటిలోని బ్యాక్టీరియాను చంపి.. దుర్వాసనను మాయం చేస్తుంది.