వేసవిలో చల్లని నీళ్లు తాగితే బరువు పెరుగుతారా?

వేసవిలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా? చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారా?..

 నిత్యం చల్లని నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

చల్లని నీళ్లు తాగితే బరువు తగ్గడం లేదా బరువు పెరగడం సంగతి పక్కన పెడితే.. నీళ్లలో కేలరీలు సున్నా ఉంటాయి

 చల్లటి నీళ్లు తాగడం జీర్ణవ్యవస్థకు అంత మంచిది కాదు. ఫలితంగా జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

వ్యక్తి రోజుకు ఎన్నిసార్లు, ఎంత పరిమాణంలో నీరు తాగాలంటే.. ప్రతి కిలోగ్రాము శరీర బరువుకు 35 మి.లీ నీరు తాగాలని నిపుణులు అంటున్నారు.

చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.