ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మూత్రపిండాల వైఫల్యం ముఖం వాపునకు కారణమవుతుంది.. దీని వలన ముఖం పెద్దదిగా కనిపిస్తుంది. ఈ లక్షణాన్ని విస్మరించవద్దు, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

 కళ్ళ చుట్టూ వాపు తరచుగా అలసటకు సంకేతంగా భావిస్తారు. అయితే, ఇది మూత్రపిండాల దెబ్బతినడానికి సంకేతం కావచ్చు

చర్మం పసుపు లేదా నల్లగా మారడం మూత్రపిండాల నష్టానికి సూచిక కావచ్చు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి..

ఎటువంటి కారణం లేకుండా మీ చర్మం పొడిగా మారితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల తరచుగా చర్మం పొడిబారి, దురదకు దారితీస్తుంది. దీర్ఘకాలిక దురదను విస్మరించవద్దు.. ఈ విషయంలో వైద్య సలహా తీసుకోండి.

ఇలాంటి లక్షణాలు తరచూ కనిపిస్తే.. వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని.. ఆలస్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు.