మీకు కోపం ఎక్కువగా వస్తుందా.. తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు..
కోపం రావడం అనేది ఒక సహజ ప్రక్రియ. అది ఒక సాధారణ మానవ భావోద్వేగం.
ఏదైనా విషయంలో నిరాశ చెందడం, తప్పు చేసినట్లు భావించడం వంటి వాటికి ప్రతిస్పందనగా కోపంగా వస్తుంది.
అనేక పరిశోధనలు అధిక కోపం మీ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిరూపించాయి.
మీరు తరచుగా కోపంగా ఉంటే, అది రక్తపోటును గణనీయంగా పెంచే పరిస్థితి కావచ్చని పరిశోధకులు తెలిపారు.
అధిక రక్తపోటు గుండె ఆరోగ్యంపై ఒత్తిడిని పెంచుతుంది, ఇది గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
ఒక అధ్యయనంలో తీవ్రమైన కోపం వచ్చిన రెండు గంటల్లోపు గుండెపోటు వచ్చే ప్రమాదం దాదాపు ఐదు రెట్లు పెరిగిందని తేలింది.
మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా కోపాన్ని నియంత్రించుకోవచ్చని, దాని వల్ల కలిగే సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
లోతైన శ్వాస, ధ్యానం-యోగా, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ద్వారా కోపాన్ని నియంత్రించవచ్చు.