జబ్బులు రాకూడదంటే..
ఈ సూపర్ ఫుడ్స్ తినండి..
గుమ్మడి కాయలు.. గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
యాపిల్స్.. యాపిల్స్ లో ఫైబర్, క్వెర్సెటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
చిలకడదుంపలు.. విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల చిలగడదుంపలు రక్తపోటును నియంత్రిస్తాయి.
బ్రెస్సెల్స్ మొలకలు.. బ్రెస్సెల్స్ మొలకలు ఫైబర్, విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి.
బేరి పండ్లు.. బేరి పండ్లలో ఫైబర్, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు, జబ్బులు రాకుండా సహాయపడతాయి.
క్రాన్బెర్రీస్.. బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.
దానిమ్మ.. దానిమ్మలో యాంటీ ఆక్సిడెటంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి ధీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
అక్రోట్లు.. వాల్ నట్స్ లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్‍లు తగ్గిస్తాయి.
Related Web Stories
రెడ్ VS గ్రీన్ యాపిల్ ఏది ఆరోగ్యకరమైనది..
వంట నూనె ఎంత మేరకు వాడాలి..
మీకు కోపం ఎక్కువగా వస్తుందా.. తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు..
చూయింగ్ గమ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..